![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -135 లో... మీ నాన్నకి గాయం అయింది. నీ వల్లే వెళ్లి సారీ చెప్పమని కన్నాతో మహా అంటుంది. నేను చెప్పను.. అసలు ఆయన్ని నాన్న అని కూడా పిలవను.. అతను, రోడ్డు మీద వెళ్ళే అతను ఒకటే నాకు అని కన్నా కోపంగా మాట్లాడి.. అక్కడ నుంచి వెళ్తాడు. వాడు నీతో ఆలా మాట్లాడడం ఏంటని మాధవ అంటాడు. నేను చూసుకుంటాను లే పెద్ది అని మహా అంటుంది. ఆ తర్వాత కన్నా అన్నది అలోచించుకుంటాడు. మళ్ళీ మహా దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు కన్నా. మీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కన్నా అంటాడు.
ఆ తర్వాత మహా ఇంట్లో అందరికి బిర్యానీ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో బిర్యానీకి వెళ్తే ఆ సివంగి కన్నతల్లి గురించి ఆరా తీస్తుందని భయపడి లోపలికి వెళ్ళడు నారాయణ. కానీ మహానే బిర్యానీ తీసుకొని వచ్చి నారాయణకి ఇస్తుంది. నువ్వు బిర్యాని పెట్టి నిజం రాబట్టాలనుకుంటున్నావు కదా.. అసలు జరగదని నారాయణ అంటాడు. ఆ తర్వాత శైలు దగ్గరికి కేశవ వెళ్తాడు. తను పట్టించుకోకుండా వెళ్తుంటే తన చెయ్ పట్టుకొని ఆపుతాడు. నీ పెళ్ళాన్న లవర్ నా చెయ్ పట్టుకున్నావని శైలు కోప్పడుతుంది. ఆ తర్వాత మహా ఆఫీస్ కి వెళ్తుంది. తనకి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ చూడరా అని కేశవతో చక్రి చెప్తాడు. మహా ఆఫీస్ కి వెళ్తుంది. తన ఆఫీస్ వాళ్లతో కలిసి సరదాగా మాట్లాడుతుంది. విక్కీతో కలిసి భోజనం చేస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని విక్కీ అడుగుతాడు. కానీ మహా ఏం చెప్పదు.
ఆ తర్వాత మహాకి చక్రి ఫోన్ చేసి మాట్లాడుతాడు. అప్పుడే సంతోష్ ఆఫీస్ లో ఎవరితోనో గొడవపడుతాడు. అది చక్రి ఫోన్ లో విని మహాని తిడుతున్నాడనుకొని ఆఫీస్ కి వెళ్లి వాడి సంగతి చెప్పాలనుకుంటాడు. ఆఫీస్ కి వెళ్లి మహాని తిట్టింది ఎవరని అడుగుతాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని మహా కోప్పడుతుంది. అందరి ముందు నా తల తీసేసినట్లు ఉందని చక్రిపై మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |